తెలంగాణ ప్రజలను కాపాడాలని, రాష్ట్రాన్ని ఆగం కానివొద్దని పోరాటం చేస్తున్నాను అని కేసీఆర్ స్పష్టం చేశారు. నా ప్రాణం ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరగనివ్వను అని కేసీఆర్ హామీ ఇచ్చారు.
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్రలో భాగంగా కేసీఆర్ మాట్లాడుతూ… బీఆర్ఎస్ ఉన్నప్పుడ ఎట్లుండే.. కాంగ్రెస్ పాలనలో ఈ ఐదు నెలలు ఎట్లుంది అని విచక్షణతో ఆలోచించాలి అని కేసిఆర్ సూచించారు. తెలంగాణ ప్రజలను కాపాడాలని, రాష్ట్రాన్ని ఆగం కానివొద్దని పోరాటం చేస్తున్నాను అని తెలిపారు. నా ప్రాణం ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరగనివ్వను అని కేసిఆర్ హామీ ఇచ్చారు. ఎన్నికల కమిషన్ నిషేధం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. మాలోత్ కవిత మచ్చ లేని మనిషి.. గత సంవత్సరాలు ఎంపీగా బ్రహ్మాండంగా పని చేసింది అని ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సారి కూడా అవకాశం ఇస్తే తెలంగాణ హక్కులు కాపాడేందుకు, నిధులు రాబట్టేందుకు, తెలంగాణను ముందుకు తీసుకుపోవడానికి మీ సేవకురాలిగా పని చేస్తది అని అన్నారు.ప్రతి క్షణం ప్రజల కోసం.. ప్రతి క్షణం ప్రగతి కోసం.. ప్రతి మాట ప్రజల కోసం.. ప్రతి అడుగు ప్రజల కోసం అన్నవిధంగా బీఆర్ఎస్ పని చేస్తుందని అన్నారు కేసిఆర్.