IPL 2024 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2024లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.చెన్నైలోని చిదంబరం స్టేడియంలో వేదికగా రాత్రి 7:30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది.

ఐపీఎల్ లో ఇరు జట్లు ఇప్పటివరకు 29 సార్లు తలపడగా చెన్నై సూపర్ కింగ్స్ 18, కోల్‌కతా నైట్ రైడర్స్ 10 మ్యాచుల్లో గెలిచాయి. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. ఈ సీజన్లో ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ కోల్‌కతా నైట్ రైడర్స్ 6 పాయింట్లతో రెండో స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ 4 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్  ప్లేయింగ్ ఎలెవన్ : రుతురాజ్, రచిన్, రహానే, మిచెల్, రిజ్వీ, జడేజా, ధోనీ, తీక్షణ, ముస్తాఫిజుర్, శార్దూల్, దేశ్పాండే

 

కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ ఎలెవన్ : సాల్ట్, నరైన్, వెంకటేశ్, శ్రేయస్, రఘువంశీ, రస్సెల్, రింకూ, రమణ్ దీప్, స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి

Read more RELATED
Recommended to you

Latest news