IPL 2024 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో భాగంగా ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్, డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.విశాఖపట్నం వేదికగా రాత్రి 7:30 గంటలకు రెండో మ్యాచ్ జరగనుంది. ఇప్పటికీ రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ గెలుపొందింది.అదే సమయంలో ఆడిన రెండు మ్యాచ్లో ను ఓడిన రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది.

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్ : రుతురాజ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, రహానే, మిచెల్, దూబే, జడేజా, సమీర్ రిజ్వీ, ధోనీ(W), దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, ముస్తాఫిజుర్.

 

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్ : వార్నర్, మార్ష్, పృథ్వీ షా, పంత్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, ఇషాంత్, అన్రిచ్ నార్టే, ఖలీల్, ముకేష్.

Read more RELATED
Recommended to you

Latest news