IPL 2024 : విజృంభించిన కోల్‌కతా ప్లేయర్స్ … భారీ స్కోర్ చేసిన కేకేఆర్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచులో కోల్కత్తా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.ఇక ఈ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ మరోసారి విశ్వ రూపం చూపించింది.7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది.

కేకేఆర్ తొలి రెండు ఓవర్లలో 17 పరుగులతో పర్వాలేదనిపించింది. అయితే మూడో ఓవర్ నుంచి అసలైన అసలైన విధ్వంసం సాగింది. ఖలీల్ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. ఇక ఇశాంత్ శర్మ వేసిన నాలుగో ఓవర్లో నరైన్ 6,6,4,0,6,4 తో మొత్తం 26 రన్స్ రాబట్టాడు. 5 ఓవర్లో 12, ఆరో ఓవర్లో 18 రన్స్ వచ్చాయి. దీంతో ఈ సీజన్ లో అత్యధిక పవర్ ప్లే స్కోర్ చేసింది.తొలి ఆరు ఓవర్లలో ఏకంగా 88 రన్స్ చేసింది.ఓపెనర్ సాల్ట్ 4 ఫోర్లతో 18 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ మరో ఓపెనర్ సునీల్ నరైన్ కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. నరైన్ 7 ఫోర్లు, 7 సిక్సర్ల తో 85 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రఘువంశి 27 బంతుల్లో 54 పరుగులు,19 బంతుల్లో 41 పరుగులు చేశారు. రింకు సింగ్ 8 బంతులు ఆడి 26 పరుగులు చేశాడు.ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో నోర్త్జ్ 3 వికెట్లు, ఇషాంత్ శర్మ రెండు వికెట్లు, ఖలీల్ అహ్మద్, మార్ష్ చెరో వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news