రోహిత్ శర్మ మళ్లీ ముంబై సారథిగా రావొచ్చు : మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ

-

ట్రేడింగ్ ఆప్షన్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుండి హార్థిక్ పాండ్యని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే హర్డిక్ పాండ్య ని కెప్టెన్గా ప్రకటించిన నాటి నుండి అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముంబైకి కెప్టెన్గా రోహిత్ శర్మ మరో సంవత్సరం పాటు ఉంటే బాగుండేదనీ కొందరు అభిమానులు అంటుంటే మరికొందరు ఈ విషయాన్ని ఫ్రాంచైజీ ముందే రోహిత్ కి తెలియజేసి గౌరవంగా అతని ద్వారానే కెప్టెన్ గా తప్పుకొమ్మని చెప్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మళ్లీ ముంబై సారథిగా రావొచ్చని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డారు. ‘ఫ్రాంచైజీలు నిర్ణయాలు తీసుకోవడంలో మొహమాటపడవు అని అన్నారు.రోహిత్ శర్మను తీసేసి పాండ్యకు కెప్టెన్సీ ఇచ్చారు. 5 టైటిల్స్ అందించిన శర్మకు తిరిగి కెప్టెన్సీ ఇవ్వొచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేశారు.పాండ్య కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. హార్దిక్ ఒత్తిడిలో ఉన్నట్లు అనిపిస్తోంది. ఏప్రిల్ 7 లోపు రోహిత్ శర్మకు తిరిగి కెప్టెన్సీ ఇవ్వొచ్చు’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news