IPL 2024 : ఆకట్టుకున్న బౌలర్లు… రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు క్వాలిఫయర్-2లో సన్ రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి.చెపాక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ దిగిన సన్రైజర్స్ 20 ఓవర్లలో 175/9 రన్స్ చేసింది.

ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ 12 పరుగులు చేసి దారుణంగా నిరాశపరిచాడు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ సెట్ చేసిన ఫీల్డింగ్ వల్ల సన్ రైజర్స్ హైదరాబాద్ 120 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయింది. హెడ్(34) పరుగులు, త్రిపాఠి(37) పరుగులు, మార్క్రమ్(1) పరుగులు, నితీశ్ రెడ్డి(5) పరుగులు చేసిన ఈ ప్లేయర్స్ షార్ట్ థర్డ్ వైపు ఆడి వికెట్లు కోల్పోయారు. క్లాసెన్ (50) కీలక సమయంలో ఔట్ కావడంతో భారీ స్కోర్ సాధ్యం కాలేదు.రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో బౌల్ట్ 3, అవేశ్ ఖాన్ 3, సందీప్ శర్మ 2 వికెట్లు పడగొట్టారు. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news