ప్రయాణికులకు గమనిక…రేపు, ఎల్లుండి పలు ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు

-

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో రేపు, ఎల్లుండి (మే 25, 26) పలు ఎంఎంటీఎస్‌ సర్వీసులను, నాలుగు డెమూ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన జారీ చేసింది.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు, ఫుట్‌ ఓవర్‌ వంతెనల నిర్మాణం నేపథ్యంలో 2 రోజులపాటు పలు రైలు సర్వీసులను రద్దు చేశారు.మేడ్చల్‌-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-ఫలక్‌నుమా,హైదరాబాద్‌-మేడ్చల్‌,లింగంపల్లి-మేడ్చల్‌ మధ్య సేవలందించే 22 ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చీఫ్‌ పీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీటితోపాటు సిద్దిపేట-సికింద్రాబాద్‌ మధ్య సర్వీసులందించే 4 డెమూ రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. కొన్ని రైళ్లను రెండు రోజుల పాటు, మరికొన్నింటిని ఒక్కరోజు రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news