ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీసీసీఐ తొలి 21 మ్యాచ్‌లకు మాత్రమే షెడ్యూల్‌ను ప్రకటించింది. మిగతా షెడ్యూల్ ని త్వరలో ప్రకటిస్తామని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం…ఐపీఎల్ 2024 ఫైనల్స్ మ్యాచ్ చెన్నైలో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇప్పటికే పూర్తి షెడ్యూల్ ని పూర్తి చేసినట్లు,మే 26న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చెన్నైలో జరగడం దాదాపుగా ఖాయమని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.
గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో గల దేశంలోనే అతిపెద్ద స్టేడియం అయినా నరేంద్ర మోడీ స్టేడియం లో ఒక క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుందని వెల్లడించారు. మరో క్వాలిఫైయర్ చెన్నైలో జరగనుందని వెల్లడించారు. ఇక దీనికి సంబంధించిన అధికారిక షెడ్యూల్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే… ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2024లో భాగంగా ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటల నుంచి జైపూర్లోజరగనుంది. రెండో మ్యాచులో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడబోతున్నాయి. అహ్మదాబాద్లో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.