IPL 2024 : రాణించిన కేకేఆర్ బౌలర్లు… కోల్కతా టార్గెట్ ఎంతంటే?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఇవాళ జరుగుతున్న 47వ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక తొలుత బ్యాటింగ్కి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.

ఢిల్లీ ఓపినర్స్ పృథ్వి షా, ఫ్రేసెర్ తక్కువ పరుగుల కి అవుట్ అయ్యారు.పృథ్వి షా 7 బంతుల్లో 13 రన్స్ , ఫ్రేసెర్ 7 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేశారు. ఇక ఆ తర్వాత వచ్చిన అభిషేకు పొరేల్ 18 పరుగులు, షై హోప్ 6 పరుగులు, కెప్టెన్ పంత్ 27 పరుగులు చేసి అవుట్ అయ్యారు.అక్షర్ పటేల్ 15 రన్స్ చేయగా,స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చివర్లో 35 పరుగులు చేసి టీమ్ను ఆదుకున్నారు. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, వైభవ్ అరోరా 2, హర్షిత్ 2, నరైన్, స్టార్క్ చెరో వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news