సోమవారం ఖమ్మంలో నిర్వహించిన రోడ్డు షోలో కేసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు, సీట్లు కావాలని.. ప్రజా సమస్యలు పట్టవన్నారు. గోదావరి జలాలను కర్ణాటక, తమిళనాడు తీసుకుపోవాలని అనుకుంటున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా ఇబ్బందులు శాశ్వతంగా తీరాలని సీతారామ ప్రాజెక్టు ప్రారంభించామన్నారు కేసిఆర్. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని,లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 12 సీట్లు వస్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు .
సంకీర్ణ ప్రభుత్వంలో నామా కేంద్రమంత్రి అవుతారని ,రాష్ట్ర ప్రయోజనాల కోసం పేగులు తెగేదాక కొట్లాడతామన్నారు కేసిఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలన్నారు. ఎన్టీఆర్ హయాంలోనే నిజమైన సంక్షేమం జరిగిందన్నారు. ప్రమాదవశాత్తు ఎవరైనా రైతు మరణిస్తే రూ.5లక్షలు ఇచ్చామన్నారు. కల్యాణలక్ష్మీ కింద తులం బంగారం ఇస్తామన్నారని అన్నారు.