పెన్షనర్ల ఉసురు ఊరికే పోదు…బాబూ అనుభవిస్తావ్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దాదాపు 70 లక్షలమంది పెన్షనర్ల పాలిట ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒక యమకింకరుడిలా తయారయ్యారు. ప్రతినెలా ఫస్ట్ తేదీన ఇంటికెళ్లి డోర్ కొట్టి మరీ పిన్షన్లు అందించే వాలంటీర్ల మీద చంద్రబాబు కక్షగట్టారు.ప్రజలకు మంచి చేస్తే చూస్తూ తట్టుకునే తత్వం లేని బాబు…ఎప్పుడూ అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.ఇప్పుడు వాలంటీర్ల మీద కూడా తన ప్రభావాన్ని చూపుతున్నారు. వాళ్ళుంటే ఇంటింటికి ప్రభుత్వ సేవలు అందుతాయి కాబట్టి వైసీపీ కి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుందని గ్రహించిన చంద్రబాబు పెన్షన్ల డోర్ డెలివరీ ని అడ్డుకున్నారు.

తన తాబేదారుగా పేరున్న మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ తో కలిసి కోర్టులో పిటిషన్లు వేయించారు చంద్రబాబు. ఎన్నికల సంఘానికి లేఖలు రాసి పెన్షన్ల డోర్ డెలివరీకి అడ్డుకట్టవేశారు. మొత్తానికి వాలంటీర్ల సేవలు నిలిచిపోవడంతో చంద్రబాబు తన పన్నాగం ఫలించిందని సంబరపగుతున్నారు. అయితే ఏప్రిల్ ఒకటో తేదీన పెన్షన్ డబ్బులు పట్టుకుని వస్తాడన్న వాలంటీర్ రాకపోవడం… దీనికి చంద్రబాబే కారణం అని తెలుసుకున్న ప్రజలు చంద్రబాబును చిత్రవిచిత్రమైన రీతిలో తిట్టిన సంగతి తెలిసిందే.ఇక బాబుకు ఓటేస్తే పెన్షన్లు కూడా తీసేస్తాడని ప్రచారం కూడా జరిగింది. దీంతో వామ్మో భారీ డ్యామేజ్ జరిగిందని గుర్తించిన చంద్రబాబు మళ్లీ మాట మార్చారు. పెన్షన్లు ప్రభుత్వ అధికారులతో పంచాలని సలహా ఇచ్చారు.

జగన్ ప్రభుత్వానికి మంచి జరుగుతుందేమో అని మొదట గుర్తించి పెన్షన్ పంపిణీ ఆపాలని చూసింది చంద్రబాబే. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ ఉద్యోగులను అందులో ఇన్వాల్వ్ చేయాలని చెప్తూ మొసలికన్నీరు కార్చేది కూడా చంద్రబాబే.ఇదంతా చూస్తున్న ఓటర్లు చంద్రబాబు కుట్రలను పసిగట్టేశారు.అందుకే చంద్రబాబుని ఈ ఎన్నికల్లో తప్పకుండా ఒడిస్తామని నిర్ణయించుకున్నారు. ఓటర్లు అలెర్ట్ కావడంతో ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు చంద్రబాబు. మళ్లీ ఈ వివాదాన్ని పక్కదారి పట్టించాలంటే ఎదో ఒకటి చేయడం చంద్రబాబుకి అలవాటు. అయితే అలాంటి ప్రయత్నాలను కూడా తిప్పికొట్టాలని ప్రజలు అప్రమత్తంగా ఉన్నారనే సంగతి గుర్తించుకోవాలని చంద్రబాబుకి ప్రజలు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news