ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య 28 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. లక్నో ఓపెనర్లలో డికాక్ దారుణంగా విఫలమయ్యారు.
8 బంతుల్లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపినర్ రాహుల్ 27 బంతుల్లో 39 పరుగులు చేసి రస్సెల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీపక్ హూడ 8 పరుగులు చేయగా, మార్కస్ స్టోయినిస్ 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.ఇక ఆయుష్ బదోని 29 రన్స్ , నీకొలస్ పూరాణ్ 35 బంతుల్లో 45 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోర్ ని అందించారు.కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో స్టార్క్ 3, వైభవ్, సునీల్ నరైన్, వరుణ్, రస్సెల్ తలో వికెట్ తీశారు.