IPL 2024: సన్ రైజర్స్ కు కొత్త బౌలింగ్ కోచ్ !

-

ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22వ తేదీన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో సన్ రైజర్స్ టీమ్కు కొత్త బౌలింగ్ కోచ్ రానున్నట్లు తెలుస్తోంది. డేల్ స్టెయిన్ స్థానంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ను బౌలింగ్ కోచ్ గా నియమించినట్లు సమాచారం. 2011, 2012 ఐపీఎల్ సీజన్లలో ఫ్రాంక్లిన్ ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడారు. ఈ టోర్నీలో కోచ్గా వ్యవహరించడం ఇదే తొలిసారి.

కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2024 ప్రారంభానికి ముందే సన్ రైజర్స్ టీమ్ బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ సంచల నిర్ణయం తీసుకున్నారు .ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 సీజన్కు దూరంగా ఉండాలని స్టెయిన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో అతడు విరామం తీసుకోవాలని భావిస్తున్నట్లు క్రిక్బజ్ తన కథనంలో పేర్కొంది. అన్నీ సజావుగా సాగితే వచ్చే ఏడాది అతడు మళ్లీ సన్ రైజర్స్ తో జాయిన్ అవుతారని తెలిపింది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news