IPL 2024 : రిషబ్ పంత్ విధ్వంసం.. గుజరాత్ కి భారీ టార్గెట్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక మ్యాచ్ , జరుగుతుంది. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.

తొలుత బ్యాటింగ్ దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్స్ పృద్వి షా ,ఫ్రాసేర్ తొలి వికెట్ కు 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.పృద్వి షా 7 బంతుల్లో 11 పరుగులు,ఫ్రేజర్ 14 బంతుల్లో 23 రన్స్ ,షయి హోప్ 5 పరుగులు చేశారు.జట్టులో కెప్టెన్ రిషభ్ పంత్ (88), అక్షర్ పటేల్ (66) అర్ధ సెంచరీలతో చెలరేగారు. ఒక దశలో 44/3తో కష్టాల్లో ఉన్న ఢిల్లీని పంత్, అక్షర్ ఆదుకున్నారు. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ (26) మెరుపులు మెరిపించారు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 3 వికెట్లు పడగొట్టారు. నూర్ అహ్మద్ ఒక వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news