క్రికెట్ ప్రపంచమంతా ఐపీఎల్ ఎప్పుడా.. ఎప్పుడా.. అని వేచి చూస్తుంది. బీసీసీఐ కీలక నిర్ణయం గురించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఐపీఎల్ ను ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ మాసాల్లో నిర్వహించేందుకు చూస్తునట్టుగా బీసీసీఐ ఇది వరకే వెల్లడించింది. అప్పటికల్లా కరోనా కేసులు తగ్గితే అన్నీ పరిస్థితులు అనుకూలిస్తేనే ఐపీఎల్ నిర్వహిస్తారు. క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ యాజమాన్యం నుండి ఓ వార్త వెల్లడయ్యింది. ఇదో చేదు వార్త అని చెప్పొచ్చు ఎందుకంటే ఐపీఎల్ ను కేవలం ఒకే రాష్ట్రంలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుపుతున్నారు ఈ మేరకు చర్చలు జరిపి త్వరలో ఏదో ఒక నిర్ణయానికి వస్తారు.
ఐపీఎల్ ను మహరాష్ట్ర లోని ముంబై లో జరిపితే బాగుంటుందని వారు భావిస్తున్నారు. ముంబై నగరంలో మూడు స్టేడియాలు ఉన్నాయి, వాంఖెడే, బ్రబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాలున్నాయి వీటితోపాటే రిలయెన్స్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌కు కూడా ప్రత్యేకించి మైదానం ఉంది. పైగా నగరం లో క్రీడాకారులు బస చేసేందుకు పూర్తి వసతులు హోటేల్స్ ఉంటాయి. పరిస్థితులు బాగోలేనందున గతంలో లాగా అన్నీ రాష్ట్రాల్లో నిర్వహించకుండా కేవలం ఒక్క మహారాష్ట్ర లోనే నిర్వహించాలని వారు భావిస్తున్నారు. ఇక ఈ అంశమ పై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.