IQoo Z6 SE: IQoo నుంచి లాంచ్‌ కానున్న కొత్త ఫోన్..బడ్జెట్‌లోనే కాస్ట్‌..!

-

IQoo Z6 SE సిరీస్‌ స్మార్ట్ ఫోన్ ఇండియాలో త్వరలో లాంచ్‌ కానుంది. జెడ్‌ సిరీస్‌లో భాగంగా కంపెనీ ఈ ఫోన్‌ను రూపొందించింది. అయితే ఇది 5G లేదా 4G అనేది ఇంకా తెలియరాలేదు. ఫోన్‌కు సంబంధించి కొంత సమాచారం అయితే ఇప్పటికే లీక్‌ అయింది.
ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుంతో తెలియరాలేదు. ఈ నెలాఖరులో లేదా ఆగస్టు ప్రారంభంలో వచ్చే అవకాశం ఉందని అంచనా… ఇందులో ఎస్ఈ అంటే స్పీడ్ ఎడిషన్ అని అర్థం. ఐకూ జెడ్6కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇందులో ప్రో కూడా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్లు ఇంతవరకు ఏ సర్టిఫికేషన్ వెబ్ సైట్‌లోనూ కనిపించలేదు. వీటి ధర కూడా రూ.20 వేలలోపే ఉండొచ్చు.
ఐకూ 10 సిరీస్ ఫోన్లు కూడా మనదేశంలో లాంచ్ కానున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ల లాంచ్‌ను కంపెనీ ఇప్పటికే టీజ్ చేసింది. జులై 19న ఐకూ 10 సిరీస్ ఫోన్లు లాంచ్ కానున్నాయి.ఇండియాలో సాయంత్రం 7:30 గంటలకు ఈ లాంచ్ కార్యక్రమం ఉంటుంది. ఐకూ 10 సిరీస్ ఫోన్లలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌ను అందించనునట్లు సమాచారం.
ఈ విషయాన్ని కంపెనీయే స్వయంగా కన్పర్మ్ చేసింది. ఐకూ దీనికి సంబంధించిన పోస్టర్‌ను వీబోలో షేర్ చేసింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ రానుంది. ఈ సిరీస్‌లో ఐకూ 10, ఐకూ 10 ప్రో రెండు ఫోన్లు ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం… వీటిలో ఒక ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ ఉండనుంది. ఇది ఐకూ 10 ప్రో మోడలా? లేకపోతే ఐకూ 10 స్మార్ట్ ఫోనా? అన్నది మాత్రం తెలియలేదు.
మొత్తానికి ఉన్న సమాచారం ప్రకారం బడ్జెట్‌లోనే ఫోన్‌ రానుంది. ఆగస్టు మొదటివారంలో ఫోన్ ఇండియాలో లాంచ్‌ అయితే బడ్జెట్‌ ఫోన్లకు మంచి పోటీనే ఇస్తుంది.!

Read more RELATED
Recommended to you

Latest news