ఇరాన్ సుప్రీం లీడర్ X అకౌంట్ సస్పెండ్..

-

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమైనీ హిబ్రూ అకౌంట్‌ను ట్విట్టర్ X సస్పెండ్ చేసినట్లు జెరూసలేం పోస్టు వెల్లడించింది. ‘జియోనిస్టు ప్రభుత్వం తప్పు చేసింది. తమ సమీకరణాల్లో ఇరాన్‌ను తప్పుగా లెక్కగట్టింది. మాకెలాంటి శక్తి, సామర్థ్యం, ఆకాంక్షలు ఉన్నాయో అర్థమయ్యేలా చేస్తాం’ అని ఖమైనీ ఆదివారం పోస్టు పెట్టారు.

‘దయామయుడైన అల్లా పేరుతో..’అని శనివారం రాసుకొచ్చారు. ఈ రెండు పోస్టులు ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల తర్వాత పెట్టిన పోస్టులే కావడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే దిశగా ఉండటంతో ఎక్స్ ఆయన అకౌంట్‌ను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఇజ్రాయెల్‌కు తమ సత్తా ఏంటో చూపిస్తామని ఇరాన్ అధ్యక్షుడు ఆదివారం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news