మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా నెగ్గడం కష్టమే : డిప్యూటీ సీఎం ఫడ్నవీస్

-

మహారాష్ట్ర ఎన్నికల వేళ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా గెలవదని, ఎన్నికల తర్వాత మాత్రం అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన గ్రౌండ్ రియాలిటీపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. మహాయుతి కూటమిలోని బీజేపీ, సీఎం ఏక్‌నాథ్ షిండె (శివసేన), అజిత్ పవార్ (ఎన్సీపీ) కలిసి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెపన్పారు.

‘బీజేపీ ఒక్కటే రాష్ట్రాన్ని గెలవదు కానీ, మాకు అత్యధిక సీట్లు, అత్యధిక ఓటింగ్ శాతం ఉన్నాయనేది నిజం. ఎన్నికల తర్వాత బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది.మూడు పార్టీల ఓట్లను ఏకీకృతం చేస్తేనే విజయం సాధిస్తామని’అన్నారు.ఇదే టైంలో టిక్కెట్లు దక్కని కొందరు బీజేపీ నేతల నిరాశ, వారు తిరుగుబాటు చేసే అవకాశాల గురించి స్పందిస్తూ.. కొందరికి టికెట్లు దక్కకపోవడం కొంత బాధించే అంశమే అని అభిప్రాయపడ్డారు. కాగా, రాష్ట్రంలో 288 సెగ్మంట్లకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. కాగా, బీజేపీ ఇప్పటివరకు 121 అభ్యర్థులను ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news