షాకింగ్ : ప్రధాని నివాసంపై ఉగ్రదాడి..

ఉగ్రవాదల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాగా ఇరాక్‌ ప్రధాని ముస్తపా అల్‌ ఖాదిమీ నివాసం పై డ్రోన్‌ దాడికి పాల్పడ్డారు. బాగ్దాద్‌ లోని ఆయన ఇంటిపై ఇవాళ ఉదయం పూట… పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్‌ తో దాడి చేశారు. అయితే.. ప్రధాని ముస్తాపా అల్‌ ఖాదిమీ సురక్షితంగా ఉన్నట్లు ఇరాక్‌ ఆర్మీ ప్రకటన చేసింది. ప్రధాని ఖాదిమీ కూడా ఈ దాడి గురించి తెలిపారు.

తాను సురక్షితంగా ఉన్నా నని… అంతా సంమయనం పాటించాలని ట్వీట్‌ చేశారు. ప్రజలు ప్రశాంతతంగా ఉండాలని సోషల్‌ మీడి యా వేదికగా తెలిపారు. ఖాదిమీ నివాసం లో కనీసం ఒక్క పేలుడు సంభవించదని.. ప్రధాని సురక్షింతంగానే ఉన్నారని ఇద్దరు ప్రభుత్వ అధి కారులు కూడా చెప్పారు. అయితే… ఈ దాడికి పాల్పడింది ఉగ్రవాద సంస్థ అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఉగ్రవాదులు ఈ దాడి పై ఎలాంటి ప్రకటన చేయలేదు.