వ‌రంగ‌ల్ : పోలీసు వాహ‌నాన్ని ఢీ కొట్టిన లారీ..ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలు..!

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ వద్ద ఘెర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. రేగొండ పోలీస్ స్టేషన్ కు సంబందించిన హైవే పెట్రోలింగ్ వాహనాన్ని ఇసుక లారీ వేగంగా వ‌చ్చి ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో పెట్రోలింగ్ వాహ‌నంలో ఉన్న ఏఎస్ఐ, డ్రైవ‌ర్ ల‌కు తీవ్ర‌గాయాలు అయ్యాయి. అదే రోడ్డు పై ప్ర‌యాణిస్తున్న వాహ‌నదార‌లు ఏఎస్ఐ ని మ‌రియు డ్రైవ‌ర్ ను వెంట‌న భ‌య‌ట‌కు తీసి వ‌రంగ‌ల్ మ్యాక్స్ క్యూర్ ఆస్ప‌త్రికి త‌రలించారు.

road accident bhupalpally district
road accident bhupalpally district

ఏఎస్ ఐ కి తల‌కు ఇత‌ర భాగాల్లో తీవ్ర‌గాయాలు అయిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇక ఈ ఘ‌ట‌న పై స‌మాచారం అందుకున్న ఉన్న‌తాదికారులు ఆస్ప‌త్రికి వెళ్లి ప‌రామార్శించారు. బాధితుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని డాక్ట‌ర్లకు సూచించారు. పోలీసు కుటుంబ స‌భ్యుల‌కు ధైర్యం చెప్పారు.