కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌సీటీసీ ఎయిర్ గుడ్‌న్యూస్‌

-

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌సీటీసీ ఎయిర్ ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యేక ఫేర్స్ వర్తిస్తాయని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. లీవ్ ట్రావెల్ కన్సెషన్ కింద బుక్ చేసే టికెట్లతో పాటు, ఇతర బుకింగ్స్‌కి ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫేర్ వర్తిస్తుందని ప్రకటించింది. ఐఆర్‌సీటీసీ ఎయిర్ ప్లాట్‌ఫామ్‌లో సులువుగా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయొచ్చని సూచిస్తోంది. ఐఆర్‌సీటీసీ రైలు టికెట్ల బుకింగ్ కోసం https://www.irctc.co.in/ పోర్టల్ ప్రత్యేకంగా ఉన్నట్టే, ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ కోసం http://air.irctc.co.in పోర్టల్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక ఛార్జీలు వర్తిస్తాయి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు http://air.irctc.co.in లేదా ఐఆర్‌సీటీసీ ఎయిర్ యాప్‌లో ఈ టికెట్స్‌ను బుక్ చేసుకోవచ్చు.
దీనిలో డిఫెన్స్ ఫేర్, ప్రభుత్వ ఉద్యోగి, ఎల్‌టీసీ ఆప్షన్స్‌లో ఒకదాన్ని ఎంచుకుని, ప్రయాణ వివరాలు నమోదు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగి
తమకు అర్హత ఉన్న క్లాస్‌లో తక్కువ చార్జీ ఉన్న నాన్‌స్టాప్ ఫ్లైట్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రయాణ సమయంలో గుర్తింపు పొందిన ప్రభుత్వ ఐడీ ప్రూఫ్ తప్పనిసరిగా ఉండాలి. ఈ కోటా కింద సీట్లు తక్కువ మొత్తంలో ఉంటాయి, కాబట్టి ముందుగా బుక్ చేసుకున్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version