అయ్యప్ప భక్తులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. మాల ధరించిన భక్తులు శబరిమల వెళ్లే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సులభమైన ప్రయాణాన్ని అందించేందుకు తొలిసారిగా ‘భారత్ గౌరవ్ రథ్’ పేరుతో ప్రత్యేక రైలును ప్రారంభించింది.ఈ ట్రైన్ సర్వీసు ద్వారా శబరిమల, చొట్టనిక్కర భగవతీ దేవి ఆలయాలను సైతం దర్శించవచ్చును.
ఈ రైలు నవంబర్ 16వ తేదీ ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభం కానుంది. అక్కడి నుంచి వయా నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఆగుతూ వెళ్తుంది. ఆయా స్టేషన్లలో బోర్డింగ్ ఫెసిలిటీ కూడా కల్పించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి శబరిమలకు 120 గంటల్లో భక్తులు తమ గమ్యస్థానానికి చేరుకుంటారు. ఈ స్పెషల్ రైలు కోసం స్లీపర్ బెర్త్ టికెట్ రూ.11,475గా ఉండగా..థర్డ్ ఏసీకి రూ.18,790గా నిర్ణయించారు.