మీరు ఏదైనా మంచి టూర్ వేసేయాలి అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ ఎన్నో రకాల టూర్ ప్యాకేజీలని అందిస్తోంది ఈ ప్యాకేజీ లతో ఎంచక్కా ఈ ప్రదేశాలన్నీ చూసి వచ్చేయచ్చు. తక్కువ ధర లోనే రకరకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకు వస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా ఐఆర్‌సీటీసీ టూరిస్టులు, భక్తులకు ఓ సూపర్ ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. ఇక దాని కోసం పూర్తి వివరాలు చూసేద్దాం.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాళి టెంపుల్ మొదలు అనేక ప్రదేశాలని ఈ టూర్ ద్వారా చూడవచ్చు.
16,600 రూపాయలకే మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాళి టెంపుల్ మొదలు ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ దాకా పుణ్యక్షేత్రాలను చూసి వచ్చేయచ్చు. భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ రైలు లో వెళ్లి రావచ్చు. ఈ టూర్ జూన్ 22 నుండి ప్రారంభం అవుతుంది. ఇక ఏయే ప్రదేశాలు కవర్ అవుతాయి అనేది చూస్తే.. అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్, జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి టెంపుల్. అలానే మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, ఆగ్రా, మధురలోని బృందావన్, హరిద్వార్, రిషికేశ్ ఇవన్నీ కవర్ అవుతాయి.
జమ్మూ అండ్ కాశ్మీర్‌లోని మా వైష్ణో దేవి ఆలయంతో పాటు, గంగమ్మ తల్లి ని కూడా చూసి రావచ్చు. రిషికేశ్ హిల్ స్టేషన్ ప్రకృతి అందాలను కూడా చూసేయచ్చు. ఈ టూర్ ప్యాకేజీ రూ. 16,600 నుండి ప్రారంభం అవుతుంది. ఈ టూర్ జూన్ 22, 2023 నుండి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీ తో ఈ ప్రయాణం చేసేయాలంటే పూణె, లోనావాలా, కర్జాత్, కళ్యాణ్, గుజరాత్ లోని వసాయ్ రోడ్, సూరత్, వడోదర స్టేషన్ల లో ట్రైన్ ఎక్కవచ్చు. 9 రాత్రులు, 10 పగళ్లు కలిపి మొత్తం 10 రోజుల పాటు ఈ టూర్ ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ లో పూర్తి వివరాలు చూడవచ్చు.