ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో… రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఒడిస్సాలో మూడు రైలు ఢీకొన్న ప్రమాదానికి సిగ్నల్ వ్యవస్థలో లోపం కారణమని ప్రాథమిక దర్యాప్తులో తెలియడంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
రైళ్ల రాకపోకలకు సంబంధించి రిలే రూములు, సిగ్నల్ వ్యవస్థలో పరికరాలకు డబ్బులు లాకింగ్ ఏర్పాట్లు చేయాలని.. లోపల ఉంటే తెలియజేయాలని రైల్వే శాఖ అన్ని జోన్ల మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది. రిలే రూముల తలుపులు తెరవడం లేదా మూసివేయడం కోసం డేటా లాగిన్ వంటివి కూడా తనిఖీ చేయాలను సూచించింది.
కాగా, ఒడిస్సా రైలు ప్రమాద సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మొన్న రాత్రి జరిగిన ఈ సంఘటన నుంచి భారతదేశం ఇంకా కోలుకోలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం….ఒడిశా రైలు ప్రమాదంలో 290కి చేరింది మృతుల సంఖ్య.