అదిరే టూర్ ప్యాకేజీ.. అద్దాల రైలులో కుక్కి టూర్..!

-

ఐఆర్‌సీటీసీ ఎన్నో రకాల టూర్ ప్యాకేజీలను తీసుకు వచ్చింది. భారతీయ రైల్వే పర్యాటకుల్ని ఆకట్టుకోవడం కోసం అద్దాల బోగీలతో రైళ్లను కూడ తీసుకొచ్చింది. పర్యాటక ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు విస్టాడోమ్ కోచ్‌లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన టూరిజం సంస్థ ఐఆర్‌సీటీసీ టూరిజం వివిధ ప్యాకేజీలని ఇస్తోంది.

దీనిలో భాగంగా కటీల్-ధర్మస్థల-కుక్కి విస్టాడోమ్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఇక ఈ టూర్ గురించి చూస్తే.. ఇది 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ. ఇక మరి ఈ ప్యాకేజీ గురించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ టూర్ ప్యాకేజీ బెంగళూరు నుంచి అందుబాటులో ఉంటుంది. యశ్వంత్‌పూర్‌ కి అద్దాల రైలు లో ప్రయాణం ఉంటుంది. సక్లేష్‌పూర్-సుబ్రమణ్య ఘాట్ సెక్షన్‌లో ప్రయాణం ఎంతో బాగుంటుంది.

పర్యాటకులు ఉదయం 7 గంటలకు యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్‌లో విస్టాడోమ్ కోచ్ ఎక్కాలి. మధ్యాహ్నం వరకు రైలు ప్రయాణం ఉంటుంది. మధ్యాహ్నం 3.40 గంటలకు బంటావాలా చేరుతారు. అక్కడ నుండి క్యాబ్‌లో సోమేశ్వర బీచ్ తీసుకెళ్తారు. బీచ్ సందర్శించిన తర్వాత రాత్రికి మంగళూరులో స్టే చెయ్యాలి. రెండో రోజు కటీల్ దేవీ ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత ధర్మస్థలకు బయల్దేరాలి.

ధర్మస్థలలో శ్రీ మంజునాథ దేవాలయం చూసాక కుక్కి బయల్దేరాలి. కుక్కిలో సుబ్రమణ్య స్వామి ఆలయం చూడచ్చు. తర్వాత రాత్రి 7.30 గంటలకు సుబ్రమణ్య రోడ్ రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు. అక్కడ రాత్రి 8.40 గంటలకు బెంగళూరు ట్రైన్ ఎక్కితే బెంగుళూరు రీచ్ అయ్యిపోచ్చు. ఇక ప్యాకేజీకి ఎంత ధర అవుతుంది అంటే విస్టాడోమ్ టూర్ ప్యాకేజీ సింగిల్ షేరింగ్ ధర రూ.14,550, ట్విన్ షేరింగ్ ధర రూ.9,240, ట్రిపుల్ షేరింగ్ ధర రూ.5,640.

Read more RELATED
Recommended to you

Latest news