ఆర్ ఆర్ ఆర్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ లను కలిపేది ఆలియా నేనా ..?

-

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా రౌద్రం రణం రుథిరం. 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఈ పాన్ ఇండియా సినిమా కోసం దేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. ఇక ఈ సినిమాను 2021 సంక్రాంతి టార్గెట్ గా రాజమౌళి సిద్దం ఆర్ ఆర్ ఆర్ ని సిద్దం చేస్తున్నారు.

అల్లూరి సీతారామరాజు పాత్రను రిలీజ్ చేసిన చేసినప్పటి నుండి ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కొమరం భీం వీడియో టీజర్ ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా నుండి ఇప్పట్లో ఎన్.టి.ఆర్ పాత్ర కొమరం భీం కి సంబంధించిన వీడియో టీజర్ వచ్చే అవకాశాలు లేవంటూ ప్రచారం జరుగుతుంది. దాంతో ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. అయితే అందరూ ఆశించినట్టుగానే ఎన్.టి.ఆర్ బర్త్ డే సందర్భంగా మే 20 న కొమరం భీం పాత్రకి సంబంధించిన వీడియో టీజర్ ని రిలీజ్ చేయనున్నారట. ఇది ప్రేక్షకులందరికి పెద్ద సర్‌ప్రైజ్ కాబోతుందని తాజా సమాచారం.

ఇక ఆర్ ఆర్ ఆర్ లో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ రాం చరణ్ కి లవర్ గా .. సీత పాత్ర లో కనిపించనుందని తాజా సమాచారం. అంతేకాదు అలియా రోల్ ఆర్ ఆర్ ఆర్ లో చాల కీలకం అని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. చరణ్ తో పాటు ఎన్టీఆర్ తో కూడా ఆలియాకి కీల సన్నివేశాలు ఉంటాయట. అంతేకాదు చరణ్ – ఎన్.టి.ఆర్ – ఆలియా మధ్య ఉద్యమానికి సంబంధించిన కీలక సన్నివేశాలు సినిమాలో ఎంతో హైలెట్ గా నిలవనున్నాయని లేటెస్ట్ న్యూస్. ఇక కథను మలుపు తిప్పుతు ఎన్.టి.ఆర్, చరణ్ లను కలిపేది కూడా ఆలియా భట్ అని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news