లాక్ డౌన్ పొడగింపుతో చిత్ర పరిశ్రమ ఇంకా అంధకారంలోకి వెళ్ళనుందా …?

-

క‌రోనా విజృంభిస్తూ రోజు రోజుకి కేసులు పాజిటివ్ అవుతుండటంతో దీనికి అడ్డుకట్ట వేసేందుకు అందరూ అనుకున్న‌ట్టే లాక్ డౌన్ ని దేశ ప్ర‌ధాని పొడిగించారు. మే 3 వ‌ర‌కూ పొడిగింపు త‌ప్ప‌నిస‌రి మోదీ వెల్లడించారు. అంతేకాదు ఈ నాలుగు రోజులు మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని అధికారకంగా తెలిపారు. దీంతో దేశ‌వ్యాప్తంగా మ‌రో 19 రోజుల పాటు బంద్ అని క్లారిటీ వ‌చ్చేసింది. నెల‌రోజులుగా కొన‌సాగుతున్న లాక్ డౌన్ టోట‌ల్ గా 49 రోజుల పాటు ఇంటికే పరిమితం కావాలని నిర్ణయించారు.

 

దాంతో సినిమా ప‌రిశ్ర‌మ‌పై లాక్ డౌన్ ప్ర‌భావం మ‌రింత ఎక్కువ‌గా ప‌డింది. నెల‌రోజులుగా షూటింగుల్లేక ఈ రంగంపై ఆధార‌ప‌డ్డ వేలాది మంది కార్మికులకు ఇంకా కష్టతరంగా మారింది. ఇక సినిమాలు తీసి రిలీజ్ చేయ‌లేక డైలమాలో ఉన్న నిర్మాత‌లకి వాటిల్లే న‌ష్టం అంతా ఇంతా కాదు. అంతేకాదు లాక్ డౌన్ ఎత్తేసినా థియేట‌ర్ల‌కు జ‌నం రార‌న్న భ‌యం కూడా చాలా మంది నిర్మాతల్లో నెలకొంది. అందుకే నిర్మాతలు ఇందుకు ప్రత్యామ్నయంగా ప‌లువురు డిజిట‌ల్ – ఓటీటీ వేదిక‌ల‌పై సినిమాల్ని రిలీజ్ చేసేందుకు సిద్ధ‌మవుతున్నారట. ఇక‌పోతే భారీ బ‌డ్జెట్ల‌తో పాన్ ఇండియా రేంజ్ సినిమాలు తెలుగులోనే మూడు నాలుగు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ స‌హా ప‌వ‌న్ కళ్యాణ్ – క్రిష్ మూవీ.. ప్ర‌భాస్ జాన్ సినిమాల మీద తీవ్ర ప్ర‌భావం ప‌డింద‌ని అంటున్నారు.

అయితే కరోనా వల్ల ఒక మేలు కూడా జరిగిందని చెప్పుకుంటున్నారు. అర్థం పర్థం లేకుండా బ‌డ్జెట్ ని పెంచుకుంటూ పోయో నిర్మాతలకి క‌రోనా మంచి పాఠం నేర్పిస్తోందని మాట్లాడుకుంటున్నారు. ఇప్ప‌టికే సెట్స్ పై ఉన్న‌ సినిమాలు.. లాక్ డౌన్ తర్వాత ప్రారంభం కావాల్సిన‌ సినిమాలు ఈ నేపథ్యంలో బ‌డ్జెట్ ను త‌గ్గించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారట. ముఖ్యంగా హీరోలు, హీరోయిన్స్, దర్శకులు, సినిమాటోగ్రాఫర్ల రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని నిర్మాతలు రిక్వెస్ట్ చేస్తున్నారట. మొత్తానికి లాక్ డౌన్ కారణంగా ఎంతవరకు బడ్జెట్ కంట్రోల్ చేసినా కూడా భారీగా ప్రభావం చూపించడం ఖాయమని సినీ ప్రముఖులు, విశ్లేషకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news