దేవుడికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళితే అశుభమేనా…?

-

మనం ఎక్కువుగా దేవాలయాలకి వెళ్లడం, పూజలని చేయడం చేస్తూనే ఉంటాం. అదీ కాక ఇంట్లో ఏదో ఒక శుభకార్యాలని కూడా జరుపుతూ ఉంటాము. అయితే వీటిలో ఏం చేసిన మనం తప్పక కొబ్బరి కాయని కొడతాము. నిజంగా ఇది పవిత్రమైనది కాబట్టే దేవునికి ఎంతో భక్తితో సమర్పించడం జరుగుతుంది. అయితే కొబ్బరికాయ గురించి వచ్చే పలు సందేహాలు గురించి ఇప్పుడే చూడండి. దీనికి సమాధానాలు మీకు తెలుస్తాయి. మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా చదివేయండి.

కొబ్బరికాయలని కొట్టినప్పుడు అప్పుడప్పుడు లోపల వైపు పువ్వు ఉంటుంది. అయితే ఎప్పుడైనా ఈ పువ్వు కనుక ఉంది అంటే శుభం అని నమ్ముతారు భక్తులు. ఇది ఇలా ఉండగా అప్పుడప్పుడు మాత్రం కొబ్బరికాయ కొట్టినప్పుడు లోపల కుళ్లినట్టు ఉంటె దానిని అశుభం అని అంటూ ఉంటారు. అయితే ఈ విషయం లో ఎంత వరకు నిజముంది..?, నిజంగా కొబ్బరికాయ కుళ్ళితే అశుభమేనా…? దీని గురించి చూస్తే.. మన పురాణాల్లో ఎక్కడా కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళితే చెడు జరుగుతుందని చెప్పబడలేదు. మామూలుగా కొన్ని కొబ్బరి కాయలు కుళ్లిపోయి ఉంటాయి. అయితే ఈ సంగతి మనకి తెలియదు. దానిని మనం దేవుడి దగ్గర కొడతాం.

అప్పుడు అది కుళ్ళి ఉంటె అది అశుభం అని మనమే మూఢనమ్మకాలు పెట్టుకుని చింతిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే..? భగవంతుడు ఒక్కటే చెప్పాడు…. భక్తితో మరియు ప్రేమతో ఫలం, పుష్పం ఏది ఇచ్చినా స్వీకరిస్తానని… ఈ విషయాన్ని శ్రీ కృష్ణుడు భగవద్గీత లో కూడా చెప్పబడి ఉంది. చూసారా…! అందుకే కొబ్బరి కాయ కుళ్లినా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ మనసు కూడా పాడు చేసుకోకండి. భగవంతుని మీద పరిపూర్ణ విశ్వాసంతో పూజ చేస్తే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version