భక్తి: పిల్లి ఎదురు వస్తే మంచిదేనా..?

-

పిల్లి ఎదురు వస్తే తిరిగి వెనక్కి వెళ్ళి పోతూ ఉంటారు చాలా మంది. ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నా.. లేదంటే శుభ కార్యాలకి ఏమైనా వెళ్తున్నా… పిల్లి అడ్డం వస్తే పెద్దవాళ్లు ఎంతో హడావిడి చేస్తారు. తిరిగి వెనక్కి వెళ్లిపోవాలని, ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చుని మంచి నీళ్ళు తాగి వెళ్లాలని అంటుంటారు. అయితే నిజంగా పిల్లి అడ్డం వస్తే వెనక్కి వెళ్లిపోవాలా…? , పిల్లి ఎదురు వస్తే ఏదైనా హాని జరుగుతుందా…? వీటి కోసం అనేక విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఆలస్యమెందుకు దీని కోసం పూర్తిగా చూసేయండి.

పూర్వ కాలం నుండి ఈ పద్ధతిని పెద్దలు అనుసరించే వాళ్ళు. అయితే అప్పట్లో వాళ్ళు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణం చేయాలి అంటే ఎడ్లబండి మీద వెళ్ళేవాళ్ళు. పైగా ఇప్పటిలాగ రోడ్లు ఉండేవి కాదు కాబట్టి అడవుల మీద నుంచి వాళ్ళు ప్రయాణం చేయవలసి వచ్చేది. ఇలా వాళ్లు ప్రయాణం చేస్తూ ఉంటే మార్గం మధ్యలో చీకటి పడిపోయేది. అప్పుడు ఏమయ్యేది అంటే ఈ పిల్లలు జాతికి చెందిన సింహాలు, పులులు వంటివి కూడా ఎడ్లబండి కి ఎదురు పడేవి.

దానితో ఎద్దులు పాపం భయపడి పోయేవి. అందుకోసమే ఈ జాతికి చెందిన జంతువులు ఏమైనా ఎదురుపడితే అప్పట్లో వాళ్లు అపశకునంగా భావించే వాళ్ళు. అయితే వాళ్ల అనుసరించిన ఈ పద్ధతి ఇప్పుడు కూడా ఇలానే ఉండి పోయింది. దీంతో ఇప్పుడు కూడా అందరూ అదే పద్ధతిని అనుసరిస్తున్నారు. కానీ చాలా మంది ఇళ్లల్లో పిల్లల్ని పెంపుడు జంతువులుగా పెంచుకుంటున్నారు.

ఇతర పెంపుడు జంతువులు లాగే పిల్లలు కూడా. వాటిని అనవసరంగా అనుకోవడం ఏమాత్రం మంచిది..? పైగా అవి మనకు ఎటువంటి హాని కూడా చేయవు. ప్రకృతి వైపరీత్యాలను ముందే పసిగట్టి మనిషిని కాపాడుతుంది కూడా. కాబట్టి వీటిని అనవసరంగా అనుకోవడం ఏమాత్రం మంచిది కాదు. నిజంగా వీటి వల్ల మనకి ఎటువంటి హానీ జరగదు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news