ఎమ్మెల్యే రాజయ్య టీఆర్ఎస్ ని చిక్కుల్లో పడేస్తున్నారా

-

టీఆర్ఎస్ అధిష్టానం తనకు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలంటే అలాగే చేయాలని అనుకున్నారో ఆఫర్లపై ఆఫర్లు ప్రకటిస్తున్నారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య. ఆయన వృత్తిరీత్యా డాక్టర్‌. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి.. అనూహ్యంగా ఆ పదవి నుంచి ఉద్వాసన పలికినా టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచినా కేబినెట్‌లో చోటు దక్కలేదు. ఇప్పుడు పార్టీ నిర్దేశించిన లక్ష్యం చేరుకోవడానికి ఆఫర్లు ప్రకటించి పార్టీని ఇబ్బందుల్లో పడేస్తున్నారు.


టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదులో భాగంగా నియోజకవర్గంలో 50 వేల మందిని చేర్చాలని ఎమ్మెల్యేలకు పార్టీ పెద్దలు నిర్దేశించారు. ఆ లక్ష్యం పెద్దది అని భావించారో లేక ఈజీగా తన టార్గెట్‌ రీచ్‌ అవ్వాలని అనుకున్నారో వెరైటీ ఆఫర్లు ప్రకటించి చర్చకు దారితీస్తున్నారు. 50వేల సభ్యత్వం పూర్తయ్యే వరకు గడ్డం తీయబోనని ప్రతిజ్ఞ చేశారు. అంతేకాదు.. పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్లు తన ఆస్పత్రిలో కాన్పు చేయించుకుంటే ఇచ్చే రాయితీలను ఏకరవు పెట్టారు. ఆడపిల్ల పుడితే ఒక్క రూపాయి ఫీజు కట్టక్కర్లేదట. అదే మగపిల్లాడు పుడితే 50 శాతం ఫీజు కడితే చాలట. ఈ ఆఫర్‌ స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం ప్రజలకు మాత్రమేనని చెప్పారు రాజయ్య.

రాజయ్య ప్రకటన బాగానే ఉన్నా.. పార్టీ వర్గాలు, ప్రజలు మాత్రం కొత్త చర్చకు తెరతీశారు. ఇదంతా ఆస్పత్రికి ప్రచారం తీసుకొచ్చే ప్రయత్నమని కొందరు కామెంట్స్‌ చేస్తుంటే.. పార్టీ పెట్టిన టార్గెట్‌ను చేరుకోలేక ఈ ఎత్తుగడ వేశారని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు. రాజయ్య ఇద్దరు కుమారులు, కోడళ్లు డాక్టర్లే. ఇటీవలే ఆస్పత్రి స్థాయిని పెంచారట. ఇదే సమయంలో రాజయ్య ఆఫర్లు ప్రకటిండచంతో చాలా మంది ఆస్పత్రికి.. రాయితీలకు ముడిపెట్టేస్తున్నారు. కుమారులు, కోడళ్ల మెడికల్‌ ప్రాక్టీస్‌కు లోటు లేకుండా భలే ప్లాన్‌ వేశారే అని నోరెళ్లబెడుతున్నారట. పైగాఉమ్మడి వరంగల్‌ జిల్లా రాజకీయవర్గాల్లో రాజయ్య ఆఫర్లు రేపుతున్న కలకలం అంతా ఇంతా కాదు. టీఆర్‌ఎస్‌ వర్గాలు సైతం దీనిపై ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.

పార్టీ సభ్యత్వాల కోసం ఆఫర్లిస్తు పార్టీ ప్రతిష్టని రాజయ్య దిజగారుస్తున్నారా అన్న చర్చ పార్టీ శ్రేణుల్లొ‌న నడుస్తుంది.
మొత్తానికి పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకు రాజయ్య చేసిన ప్రయోగం పార్టీని చిక్కుల్లో పడేసిందా అన్న చర్చ నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news