జనసేన పార్టీని బిజెపిలో విలీనం చేస్తారని చాలా మంది సోషల్ మీడియాలో అనడం చూసి నిజమేనెమో అనుకునే వారు కొంత మంది. సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు చేసి సంబరపడే వారు ఇంకొందరు. జనసేన పార్టీని బిజెపిలో విలీనం చేసి ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అవుతాడు అనేసే వారు. రాజకీయ౦ అనేది ఈ రోజుల్లో అంచనా వేయలేకపోతుంటే వీళ్ళ గోల వీళ్ళది అనుకునే వారు మరికొందరు.
వైజాగ్ వెళ్ళిపోయి లాంగ్ మార్చ్ చేస్తాను అంటూ పిలుపు ఇచ్చేయగానే ఆయన సన్నిహిత పార్టీ అయిన తెలుగుదేశం మద్దతు ఇవ్వగానే ఒక్కసారి రాజకీయాల మీద అంచనా వేసే వాళ్లకు అనేక అనుమానాలు మరి. చూసే వాళ్ళు అనుమానం ఏంటి అంటే జనసేన పార్టీని బిజెపిలో కలపడానికి, తన బలం ఇది అని చూపించడానికి తెలుగుదేశం సహకారం తీసుకుని జనాలను భారీగా తీసుకొచ్చారని. ఆ తర్వాత, అంతక ముందు పవన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే అదే అనుమానం వస్తుంది మరి. సరే ఇప్పుడు విషయానికి వచ్చి చూద్దాం.
ఇప్పుడు జనసేన పార్టీ బిజెపిలో కలిసిపోవడానికి సమయం ఆసన్నమైంది అంటున్నారు కొందరు. బిజెపి ఎంపీలు పదే పదే పవన్ ని కలవడం, ఆయన ఢిల్లీ వెళ్ళడం, తాజాగా కేంద్ర మంత్రి ఒకరు పవన్ తో హైదరాబాద్ లో కలిసారు అనడం, ఈ వార్తలు అన్నీ చూస్తుంటే జనసేన బిజెపిలో కలిసిపోవడం ఖాయమేనేమో అనే అనుమానాలు ఇప్పుడు జనాల్లో బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా కొందరు బిజెపి ఎంపీలు ఆయన్ను కలిసారట. ఎందుకు కలిసారో ఏంటో గాని సోషల్ మీడియా మాత్రం జనసేన జెండాకు కాషాయం రంగు పులిమేసింది. చూద్దాం ఏమవుతుందో.