సమంత రెండో వివాహం చేసుకోబోతోందా.. ఇందులో నిజమెంత..!!

-

టాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరు పొందిన నాగచైతన్య – సమంత వివాహమైన నాలుగు సంవత్సరాల తర్వాత విడిపోతున్నామని సోషల్ మీడియాలో ప్రకటించడం జరిగింది. దీంతో వీరి అభిమానులు ఈ విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఎవరు పనులలో వారు బిజీగా ఉన్నప్పటికీ వీరి పైన పలు వార్తలు ఎప్పుడూ ట్రెండీ గా మారుతూనే ఉంటాయి. ఒకవైపు సమంతా అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా మరొకవైపు రెండో వివాహం చేసుకోబోతోంది అంటూ పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి.. వాటి గురించి తెలుసుకుందాం.

సమంత రెండో వివాహం చేసుకోబోతున్నట్లు కొంతమంది ప్రచారం చేయడంతో అక్కినేని అభిమానులు మాత్రం ఈ విషయంలో చాలా అసంతృప్తిని తెలియజేస్తున్నట్లు సమాచారం. రెండో వివాహం సమంతా చేసుకున్నదంటే నాగచైతన్యను అవమానించినట్లే అవుతుందని అందరూ భావిస్తున్నారు. టాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న కథనం ప్రకారం సమంత మయోసైటిస్ కు సంబంధించి చికిత్స కోసం సౌత్ కొరియాకు వెళ్లబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అక్కడే ఉండి కొద్దిరోజులు తమ ఆరోగ్యాన్ని చక్కబెట్టుకొని వస్తుందని అభిమానులు సైతం భావిస్తున్నారు.

ప్రస్తుతం నాగచైతన్య కూడా కస్టడీ అనే చిత్ర షూటింగ్లో కూడా బిజీగా ఉన్నారు. ఇక సమంత కొరియా నుంచి తిరిగి వచ్చిన తర్వాత సినిమా షూటింగ్లో పాల్గొనబోతోంది అంటూ ఆమె అభిమానులు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. నాగచైతన్య కూడా త్వరలోనే రెండో వివాహం చేసుకోబోతున్నారు. అది కూడా ఒక హీరోయిన్ ని అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ సమంత రెండో వివాహం పై ఆమె సన్నిహితుల నుంచి తెలుపుతున్న సమాచారం ప్రకారం సమంతకు అలాంటి ఆలోచన లేదని కేవలం తన దృష్టి అంత ఇప్పుడు తన ఆరోగ్యం మీద ఉందని తెలియజేస్తున్నట్లు సమాచారం. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అనే విషయం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news