డైరెక్టర్ పూరీ కొడుకు కెరీర్ నిలబడాలంటే..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది సినీ బ్యాక్ గ్రౌండ్ కలిగిన కుటుంబం నుంచి నటీనటులు ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి వారిలో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు మరి కొంతమంది ఫెయిల్యూర్ గా మిగులుతున్నారు. అలా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుటుంబం నుంచి తన కుమారుడు ఆకాశ్ పూరి మొదటిసారి మెహబూబా సినిమాతో తన కెరీర్ ని ప్రారంభించారు. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆకాష్ పూరి పలు చిత్రాలలో నటించిన కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఎంతో మందిని స్టార్ హీరోలు చేసిన పూరీ తన కొడుకు కెరియర్ ని మాత్రం చక్క పెట్టలేక పోతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తూ ఉంటాయి.

ఇక పూరి పరిస్థితి కూడా లైగర్ సినిమా తర్వాత మరింత దారుణంగా మారిపోయింది. మరొకవైపు ఆకాష్ పూరి కూడా ఈ మధ్యకాలంలో రొమాంటిక్ ,చోర్ బజార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో ఇప్పుడు తాజగా పూరి జగన్నాథ్ తన కొడుకు కెరియర్ కోసం ఒక మంచి కథను రెడీ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొంతమంది మాత్రం ఇంట్లోనే హీరోని పెట్టుకొని ఎందుకు పూరి జగన్నాథ్ బయట వైపు చూస్తున్నారని కామెంట్స్ కూడా చేస్తున్నారు.

ఇక తన కుమారుడిని హీరోగా పెట్టి సినిమా తీసి సక్సెస్ కొడితే బయట హీరోలు మళ్ళీ పూరికి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు ఆకాష్ పూరి కెరియర్ పరిస్థితి పెద్దగా ఆశాజనకంగా లేదని చెప్పవచ్చు. ఒకవేళ ఇలాగే ఫ్లాపులు వెళ్ళబడుతుంటే రాబోయే రోజుల్లో ఆకాష్ పూరితో సినిమాలు తీయడానికి ఎవరు ముందుకు రారని చెప్పవచ్చు. దీంతో కెరీర్ కూడా దెబ్బతింటుందని అభిమానులు సైతం భావిస్తున్నారు. అందుకే పూరి జగన్నాథ్ తన కొడుక్కి ఒక సక్సెస్ ఇవ్వాలని పూరి, ఆకాశ్ అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news