హీరో విష్వక్ వివాదంతో లాభం ఎంత నష్టం ఎంత అన్నది ఇప్పుడు ఓ పెద్ద చర్చకు తావిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ మూవీ ప్రమోషన్ వర్క్ ఇంతగా వివాదం కాలేదు. ఆ మాటకు వస్తే ప్రాంక్ వీడియోలన్నవి ఎప్పటి నుంచో ఉన్నాయి. కేవలం లాయర్ అరుణ్ కుమార్ మాట్లాడితేనో లేదా మరొకరో ఇంకొకరో మాట్లాడితేనో నిజాలు వస్తాయి అని అనుకోలేం కానీ మాట్లాడుతున్న వారిని గౌరవించడం మేలు. ఇక జెండర్ సెన్సిటివిటీ పేరిట ప్రముఖ యాంకర్ నానా యాగీ చేస్తున్నారు. అది కూడా సబబు కాదు. ఆ మాటకు వస్తే హీరో విష్వక్ ను ఉద్దేశించి ఆమె అదే ప్రముఖ ఛానెల్ వేదికగా ఎన్నో మాటలు అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఇక వివాదం అసలు విషయానికే వస్తే చాలా రోజుల నుంచి సినిమా ప్రమోషన్ వర్క్ అన్నది కొత్త పుంతలు తొక్కుతోంది. ఉన్నపళాన ఇమేజ్ తెచ్చుకోవాలని అన్న యావతో కొన్ని తప్పుడు పనులు కూడా చేస్తున్నారన్న వాదన ఒకటి విస్తృతం అవుతోంది. ప్రచారానికి నోచుకుంటోంది. తాజాగా జరిగిన వివాదం కూడా ఇలాంటిదే ! కనుక ఈ వివాదంతో సినిమా జీవితం కానీ సినిమా ఫలితం కానీ ఒక్కసారిగా మారిపోదు. అదేవిధంగా తప్పుడు మాటలు ఎవ్వరు మాట్లాడినా తప్పే ! న్యూస్ ఛానెల్ నిర్వాహకులు కూడా ఆ స్థాయి భాష మాట్లాడకూడదు.
ఆ విధంగా మాట్లాడితే ఎవరిని వారు దిగజార్చుకున్నవారే అవుతారు తప్ప సమాజం నుంచి వారికి మద్దతు రాదు. అందుకే ఇప్పటిదాకా ఈ విషయమై ఎవ్వరు ఒపీనియన్ పోల్ నిర్వహించినా కూడా అంతా విష్వక్ వైపే ఉన్నారు. అంటే ఆ ఛానెల్ అంటే జనాలకు ఎంత కోపం ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వెయ్యి మంది కామెంట్లు రాస్తే అందులో 99 శాతం విష్వక్ కు మద్దతు ఇచ్చినవే అంటే ఆ ఛానెల్ అంటే ఎంత అయిష్టంతోనో లేదే ఏహ్య భావంతోనో జనం ఉన్నారో కూడా ఇట్టే అర్థం చేసుకోవచ్చు.