విశాఖలో అవినీతి కోసం కలెక్టర్ నే పెట్టారా…?

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. విశాఖ జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని ప్రభుత్వం కొన్ని ఫైల్స్ క్లియరెన్స్ కోసమే తీసుకువచ్చింది అని ఆయన ఆరోపించారు. విజయ సాయి రెడ్డి గారి సమక్షంలో పనిచేస్తున్నారు అని అన్నారు. భూములు, ఇసుక, మైనింగ్ అన్ని వ్యవహారాలు వేణుగోపాల్ రెడ్డి చూస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు.

వివాదాస్పద భూములు 22 ఏ ఫైల్స్ ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజా వ్యతిరేకత వచ్చిన ఎలాంటి మైన్స్ కు కూడా అనుమతి ఇవ్వలేదని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక క్లియర్ చేస్తున్నారని మండిపడ్డారు. ఆ గనుల తవ్వకాలు జరిగితే విశాఖకు నీటి కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. పాలన రాజధాని ప్రకటన ముందు వేల సంఖ్యలో ఇక్కడ రిజిస్ట్రేషన్లు జరిగాయని… దీనిని ఇన్సైడ్ ట్రేడింగ్ అనరా అని ప్రశ్నించారు.