హైవేపై పది అడుగుల కొండచిలువ.. ట్రాఫిక్ అంతరాయం.

ముంబై రోడ్లపై కొండచిలువ హల్చల్ చేసింది. హైవేపై కనిపించిన కొండచిలువ అందరినీ షాక్ కి గురి చేసింది. సుమారు పది అడుగుల కొండ చిలువ రొడ్డు దాటుతూ కనిపించింది. ఈ సంఘటన ముంబైలో జరిగింది. ముంబైలోని సబర్బన్ చునాబట్టి వద్ద రోడ్డు మీద వస్తున్న వాహనదారులకి సడెన్ గా ఏదో పాకుతూ ఉన్న జీవి కనిపించడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంగా అటుకేసి చూసారు. పది అడుగుల కొండచిలువ రోడ్డు దాటడానికి కష్టపడుతూ ప్రయాణీకుల కళ్లపడింది.

ఈ నేపథ్యంలో అందరూ రోడ్డు మీద ఆగిపోయేసరికి ట్రాపిక్ జామ్ అయ్యింది. మెల్లగా రోడ్డు దాటిన కొండచిలువ, అక్కడే ఉన్న కారు కిందకి వెళ్ళింది. దాంతో కొండచిలువని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని పిలిపించారు. ఆ తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేసారు. నగరంలో రోడ్డు మీద కొండచిలువ కనిపించడం చాలా అరుదు.