ఆలీ చెల్లెలు మరణించడం వెనుక ఇంత విషాదం దాగి ఉందా..?

-

కమెడియన్ గా.. హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న యాక్టర్ ఆలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు రాజకీయంలో కూడా రాణిస్తూ ఈ మధ్యకాలంలో గత కొన్ని సంవత్సరాలు నుంచి ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమానికి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి ఆలీతోపాటు సుమా కూడా హాజరయ్యారు. ఇందులో భాగంగానే యాంకర్ సుమ ఆలీని ప్రశ్నిస్తూ ముగ్గురు అక్కలు.. ఇద్దరు చెల్లెలు.. మీరు.. ఖయ్యూం భాయ్ కదా మీ ఫ్యామిలీ అని చెబుతుండగానే.. మా చెల్లెలు ఒకరు చనిపోయారు అంటూ ఎమోషనల్ అయ్యారు ఆలీ.

ఆలీ మాట్లాడుతూ..” మా చెల్లెలు గర్భవతి.. నిండు శూలాలు.. బిడ్డకు పాలు తాగించాలని..పోయి మీద ఉన్న పాలను తీసుకోవడానికి.. గుడ్డ కోసం వెతకగా అది కనిపించలేదు.. దాంతో తన పైటకొంగును తీసి పాల గిన్నెను కింద పెట్టింది. అప్పటికే అంటుకున్న కొంగును గమనించక వెనక్కి వేసుకున్న వెంటనే శరీరం మొత్తం కాలిపోయింది. అది చూసిన పక్కింటి వాళ్ళు బోరుబావిలో నుంచి నీళ్లు ఆమెపై పోసేశారు. కానీ అప్పటికే కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది.. తర్వాత నా చెల్లి కూడా మరణించిందంటూ” అంటూ తన చెల్లికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూ మరింత ఎమోషనల్ అయ్యారు ఆలీ.

అయితే ఈ విషయం తెలుసుకొని అటు ఆలీ అభిమానులు.. ఇటు టీవీ ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ కూడా అయ్యో పాపం అంటూ తమ బాధను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆలీ రాజకీయాలలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news