చమ్మక్ చంద్ర జబర్దస్త్ ను వీడడానికి కారణం ఇదేనా..?

-

జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన కమెడియన్లు చాలామంది ఉన్నారు. ఇందులో ముఖ్యంగా చమ్మక్ చంద్ర కూడా ఒకరు. ఎక్కువగా ఫ్యామిలీకి సంబంధించిన ఎంటర్టైన్మెంట్స్ స్కిట్ లను చేస్తూ బాగా పాపులారిటీ సంపాదించారు. అయితే నాగబాబు జబర్దస్త్ వదిలి వెళ్ళ గానే ఆయనతో పాటు చమ్మక్ చంద్ర కూడా వెళ్ళిపోయి జీ తెలుగులో పలు కామెడీ షో లో నటిస్తున్నారు. అయితే జబర్దస్త్ షో నుంచి బయటికి రావడానికి పలు కారణాలను కూడా తెలియజేశారు చమ్మక్ చంద్ర.

మల్లెమాల తో పలు విభేదాలు జరిగాయని అందుచేతనే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చారని వార్తలు కూడా వినిపించాయి. అయితే చమ్మక్ చంద్ర మాత్రం తాను కేవలం నాగబాబు గారు మీరు కూడా వస్తే బాగుంటుంద ని అడగగానే.. ఆయన మీద గౌరవంతో సరే అని బయటికి వచ్చానని తెలియజేశారు. కానీ ప్రస్తుతం చమ్మక్ చంద్ర జీవిత విషయానికి వస్తే. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కువగా తన సినిమాలలో చమ్మక్ చంద్ర అవకాశాలు బాగా ఇస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇతర డైరెక్టర్లతో బాగానే పరిచయం ఉన్నా కూడా అంతగా కనెక్ట్ కాలేకపోయారు.

సోషల్ మీడియాలో కూడా చంద్ర స్కిట్ బాగా వైరల్ గా మారేవీ. ఆయన టాలెంట్ కు తగ్గట్టుగానే జబర్దస్త్ యాజమాన్యం రెమ్యూనరేషన్ ఇస్తూ ఉండేది. అయితే ప్రస్తుతం జీ తెలుగు యాజమాన్యం మాత్రం ఒక్కో ఎపిసోడ్ కు రూ.5 లక్షలు ఇస్తున్నట్లుగా సమాచారం. దీన్ని బట్టి చూస్తే చంద్రకి అక్కడ కూడా బాగా డిమాండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాదులో కోటిరూపాయలు విలువచేసే ఒక సొంత ఇల్లు తో పాటు.. ఒక BMW కారుతో పాటుగా కొన్ని భూములు కూడా కొనుగోలు చేశారని సమచారం. చమ్మక్ చంద్ర తన సొంత గ్రామం లో కూడా చాలా పొలాలు ఉన్నట్లుగా సమాచారం. మొత్తం మీద దాదాపు రూ.17 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తి ఉన్నట్లుగా సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version