అందమంతా చీరలోనే ఉంటుందంటే ఇదేనేమో.. ఇస్మార్ట్ భామ అదరగొడుతోంది..

ఆడవాళ్ళు చీర కడితే ఆ అందమే వేరు. కాలాలు మారుతున్న కొద్దీ వస్త్ర ధారణలో ఎన్ని మార్పులొచ్చినా చీరకి ఉన్న ఇంపార్టెన్స్ అందరికీ తెలిసిందే. ఆడవాళ్ళ సహజ సౌందర్యానికి చీర మరింత వన్నె తెస్తుంది. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ చీరలో మెరిసిపోతున్న ఫోటో తాజాగా వైరల్ అయ్యింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ట్రెండీగా కనిపించి అందరి మనసుల్లోకి దూరిన నభా నటేష్, చీర కట్టి గిలిగింతలు పెడుతుంది. ముందుకు నడుస్తూ సడెన్ గా వెనక్కి తిరిగి ఫోటోకి ఇచ్చిన ఫోజు అదిరిపోయింది.

Ismart Actress Nabha Natesh Saree Stills

చూడగానే ఏదో దివ్యత్వం కనిపించినట్టుగా మనసును ఉల్లాస పరిచింది. చిన్న బొట్టు, అందమైన నవ్వు చాలా సహజంగా ఉంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన సోలో బ్రతుకే సో బెటరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నభా నటేష్, మరో రెండు మూడు సినిమాలని లైన్లో పెట్టింది.