అనంతపురంలో దొరికిన హైదరాబాద్ డాక్టర్.. ఇద్దరు కిడ్నాపర్లు అరెస్ట్ !

-

హైదరాబాద్ కిడ్నాపర్లకు అనంతపురం పోలీసులు చెక్ పెట్టారు. నిన్న సాయంత్రం కిడ్నాప్ అయిన డెంటిస్ట్ హుస్సేన్ ను కిడ్నాపర్ల నుంచి అనంతపురం జిల్లా పోలీసులు రక్షించారు. హైదరాబాద్ ఎక్సైజ్ కాలనీలో దంత వైద్యుడు హుస్సేన్ నిన్న సాయంత్రం కిడ్నాప్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు ఏపీలోని అన్ని జిల్లా పోలీసు కార్యలాయాలకి మెసేజ్ పంపారు. ఈ క్రమంలో అనంత ఎస్పీ సత్యయేసుబాబు అనంతపురం జిల్లాలో అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేశారు.

అయితే ఈ విషయం తెలియక అనంతపురం మీదుగా బెంగళూరుకు డాక్టర్ ని తరలించేందుకు కిడ్నాపర్ గ్యాంగ్ యత్నించింది. ఈ క్రమంలో అనంతపురంలోని ఒక చెక్ పోస్ట్ వద్ద డాక్టర్ హుస్సేన్ ను అనంతపురం జిల్లా పోలీసులు గుర్తించి రక్షించారు. కిడ్నాపర్ లలో ఇద్దరు దుండగులు పరారీ కాగా మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రాప్తాడు పోలీసుల అదుపులో ఆ ఇద్దరు కిడ్నాపర్లు ఉన్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news