“హమాస్” ఉన్మాదానికి పసిపిల్లలు బలి.. దారుణం కదా !

-

ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాల మధ్యన జరుగుతున్న యుద్ధంలో చాలా ప్రాణనష్టం జరుగుతోంది. యుద్ధం అన్న తర్వాత ఇరు వైపులా సైనికులు మరణించడం ఎక్కువగా చూస్తూ ఉంటాము..రాజుల కాలం నాటి యుద్ధ నీతి ప్రకారం సామాన్యుల ప్రాణాలను హరించకూడదు. కానీ ఇప్పటి యుద్ధం అందుకు పూర్తి విరుద్ధం జరుగుతున్నాయి. అందులోనూ హమాస్ కు చెందిన ఉగ్రవాదులు మరియు ఉన్మాదులు ఇజ్రాయెల్ లో ఎవ్వరినీ వదలకుండా చంపుకుంటూ పోతున్నారు. తాజాగా ఇజ్రాయెల్ లోని ఒక ఇంటిలోని దృశ్యం మనసులను కకావికలు చేస్తోంది. ఉన్మాదంతో కళ్ళు మూసుకుపోయిన హమాస్ మిలిటెంట్లు చిన్న పిల్లలు అని కూడా చూడకుండా, ఆడుకుంటూ, అల్లరి చేస్తూ, ముద్దు మాటలతో మురిపించే వారిని కూడా మట్టుపెడుతున్నారు. కనీసం జాలి అనేది లేకుండా ఇజ్రాయెల్ లోని ఒక ఇంట్లో చిన్నారుల బెడ్ రూమ్ ను రక్త సిక్తంగా మార్చి వేశారు. ఈ చిత్రాన్ని చూస్తే ప్రతి మనిషికి కన్నీళ్లు రాక మానవు.

మరి ఈ యుద్ధం ఎప్పుడు ఆగనుందో ? ప్రపంచం లోని మిగతా దేశాలన్నీ ఏమి చేస్తున్నాయో అర్ధం కావడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news