ఒక ఇజ్రాయేలీ నగల తయారీ సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కరోనా వైరస్ మాస్క్ ను తయారు చేసింది. ఈ మాస్క్ ను బంగారం, వజ్రాలతో పొదిగారు. అమెరికన్ డాలర్లలో ఈ బంగారపు వజ్రాల మాస్క్ ఖరీదు 1.5 మిలియన్ డాలర్లు… అంటే మన భారతదేశ కరెన్సీలో అక్షరాల 11 కోట్ల 23 లక్షల 35 వేల రూపాయలు.
ఇదిలా ఉండగా 18 క్యారెట్ల ఈ తెల్లబంగారం మాస్క్ ను అలంకరించేందుకు 3600 తెల్ల, నల్ల డైమండ్ లను ఉపయోగించారు. ఎంతో క్వాలిటీ గల టాప్ రేటెడ్ అయిన N99 ఫిల్టర్లను కూడా దీనికి అమర్చారు. అసలు దీనిని తయారుచేసిన డిజైనర్ ఐసాక్ లేవి చెబుతున్నది ఏమిటంటే…. ఇంత ఖర్చు పెట్టి దీనిని ఇంత కష్టపడి తయారు చేయడానికి వినియోగదారుడి డిమాండ్లే కారణం అట. అమెరికాలో నివసిస్తున్న ఒక చైనీస్ వ్యాపారవేత్త దీనిని తమకు ఆర్డర్ ఇచ్చినట్లు అందుకు తగ్గట్లు వారు బంగారం, వజ్రాలతో ఈ తెల్లటి ఖరీదైన మాస్కుని తయారు చేసినట్లు చెప్పారు. అయితే ఎవరైతే ఈ ఆర్డర్ ఇచ్చారో అతని పేరు చెప్పడానికి మాత్రం ఐసాక్ నిరాకరించాడు.
ఈ రోజుల్లో కరోనా వైరస్ నుండి తప్పించుకునేందుకు మాస్క్ అత్యవసరమైన నేపథ్యంలో ఇటువంటి మాస్కుని పెట్టుకునేందుకు నిర్ణయించుకున్నా ధనవంతుడు ఎవరో తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు. మొత్తం 270 గ్రాముల బరువు కలిగిన ఈ మాస్క్ ను సాధారణ సర్జికల్ 100 రేట్లు ఎక్కువ బరువు తో తయారు చేశారు. అయితే మనం మామూలు మాస్కులు వేసుకుని పెట్టుకొని తిరిగినట్లు దీనిని నిరంతరం పెట్టుకొని తిరిగేందుకు ఉండదు. ఈ మాస్క్ ను ఎక్కువ సేపు పెట్టుకుంటే… వినియోగదారుడి ముఖం అధిక బరువు వల్ల బాగా ఇబ్బంది పడుతుంది.
జెరుసలేం దగ్గరలోని ఒక కర్మాగారంలో ఐసాక్ లేవి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మాస్క్ కు సంబంధించిన పలు భాగాలను చూపించారు. ఈ మాస్క్ పెట్టుకున్నప్పుడు గాలి బాగా ఆడేందుకు బంగారపు ప్లేట్ తో ఒక రంధ్రం చేసి దానిని ఫిల్టర్ గా ఉపయోగిస్తున్నారు. మొత్తానికి తమకు ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ దీనిని చూసి తమ పనితనాన్ని మెచ్చుకుంటాడు అని తాము ఆశిస్తున్నట్లు లేవి తెలిపారు.