ఇస్రో మరో రికార్డ్, ప్రయోగం సూపర్ సక్సెస్…!

-

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అంతరిక్ష పరిశోధనల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇస్రో మరో ఘనతను సొంతం చేసుకుంది. అంతరిక్ష పరిశోధనల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది ఇస్రో. భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి విజయవంతంగా ప్రయోగించింది.

ఈ రోజు తెల్లవారుజామున 2.35 గంటలకు ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ వాహకనౌక ద్వారా జీశాట్-30 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇది కేవలం 38 నిమిషాల్లో జరగడం విశేషం. 3357 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని సమాచార వ్యవస్థ కోసం ప్రయోగించారు.

దీని ద్వారా టెలివిజన్, టెలి కమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్ సంబంధిత సేవలు ఇక నుంచి మెరుగు పడనున్నాయి. ప్రస్తుతం ఉన్న ఇన్‌శాట్- 4ఏ స్థానంలో మరింత మెరుగ్గా సేవలందించేందుకు గాను జీశాట్-30 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. దీనిపై ఇస్రో ట్వీట్ కూడా చేసింది. ప్రయోగం విజయవంతమైందని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version