ఇళ్ల నిర్మాణ అనుమతుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు గాను తెలంగాణా ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. తాజాగా తీసుకొచ్చిన చట్టం ద్వారా ఇక నుంచి ఇంటి అనుమతులు సులభంగా మంజూరు కానున్నాయి. దీని ద్వారా 75 గజాల్లోపు స్థలంలో జీ+1 ఇంటి నిర్మాణానికి అనుమతులు తీసుకోనవసరం లేదని ప్రభుత్వం తెలిపింది.
అదే విధంగా ఆన్లైన్ లో వివరాలు సమర్పించి కేవలం రూపాయి చెల్లి చాలు ఇల్లు నిర్మాణం చేసుకొనే సదుపాయం కల్పించింది ప్రభుత్వం. అంతే కాకుండా నిర్మాణం పూర్తి అయిన తర్వాత మునిసిపాలిటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా పొందాల్సిన అవసరం లేదని నూతన చట్టం చెప్తుంది. 64 చదరపు అడుగులు నుంచి 500 చదరపు అడుగుల లోపు విస్తీర్ణంలో పది మీటర్ల ఎత్తులో ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే,
ఆన్‌లైన్‌లో సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పిస్తే ప్రభుత్వం వెంటనే అనుమతి ఇస్తుంది. 200 చదరపు అడుగుల లోపు లేదా 7 మీటర్ల లోపు భవనాలను కట్టేవారు 10శాతం బిల్డప్ ఏరియాను కూడా తనఖా పెట్టె అవసరం లేదని నూతన చట్టం చెప్తుంది. అంతే గాని తప్పుడు వివరాలు ఇస్తే నోటీసులు కూడా లేకుండా ఇల్లు కూల్చేస్తారు అధికారులు. అది అలా ఉంటే, 500 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ, 10 మీటర్ల లేదా అధిక ఎత్తులో ఇల్లు నిర్మించుకోవాలనుకునే వాళ్లకు ఆన్‌లైన్‌లో 21 రోజుల్లో అనుమతి లభిస్తుంది.