ఈ ఏడాది రెండవ రాకెట్ ప్రయోగానికి సిధ్ధమైన ఇస్రో.. ఈరోజే !

-

ఈ ఏడాది రెండవ రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్దమయింది. నిన్న మధ్యాహ్నం 2.41 గంటలకు పీఎస్ ఎల్వీ సీ-50 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ మొదలయింది. 25 గంటల కౌంట్‌డౌన్‌ తర్వాత ఈరోజు మధ్యాహ్నం 3.41 గంటలకు నింగిలోకి నిప్పులు విరజిమ్ముతూ పీఎస్‌ఎల్‌వీ-సి50 వాహకనౌక దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగం ద్వారా 1,410 కిలోల బరువు గల కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ సీఎంఎస్‌-01ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు మన శాస్త్రవేత్తలు.

సమాచార వ్యవస్థ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్జానం కలిసిగిన సిఎంఎస్-01 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపుతున్నారు. ఈ శాటిలైట్ సి-బ్యాండ్ సేవల విస్థరణకు దోహదపడనుంది. ఇస్రో చరిత్రలోనే సిఎంఎస్-01 42వ సమాచార ఉపగ్రహం. 1410 కిలోల ఈ సిఎంఎస్ – 01 శాటిలైట్ జీవిత కాలం ఏడేళ్లు. ఈ ప్రయోగం విజయమంతమైతే దేశంతో పాటు అండమాన్ నికోబార్, లక్షద్వీప్ కి సమాచార వ్యవస్థ పూర్తిస్థాయిలో మెరుగు పడనుంది. 20.11 నిమిషాల్లోనే కక్ష్యలోకి ఉపగ్రహాన్ని విడిచిపెట్టేలా ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news