కొన్ని రోజుల క్రితం ఇస్రో చంద్రునిపై చేసిన పరిశోధనల వలన ప్రపంచం మొత్తం మనల్ని గర్వంగా చూసింది. ఇప్పుడు మరో పరిశోధనకు ఇస్రో నడుం కట్టిన విషయం తెలిసిందే. భగభగ మండే సూర్యుని పై పరిశోధనలు చేయడానికి ఒక వ్యోమ నౌకను పంపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యోమన్ నౌకకు ఆదిత్య ఎల్ 1 అని నామకరణం కూడా చేశారు.. ప్రస్తుతం ఇస్రో చైర్మన్ సోమనాధ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ నౌక ప్రయాణం చివరి దశకు చేరుకుందట, ఇక ఈ నౌక గమ్యస్థానానికి చేరుకోవడానికి ఇంకా ఒకటిన్నర నెల సమయం పట్టే అవకాశం ఉందంటూ ప్రకటించారు సోమనాధ్. ఈ ప్రయోగాన్ని సెప్టెంబర్ లోనే మొదలు పెట్టగా ఇప్పటివరకు ఈ నౌక 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించినట్లు అధికారికంగా ఇస్రో తెలిపింది.
ఇక ఎప్పుడైతే ఎల్ కు చేరుకుంటుందో అప్పుడు సూర్యుడి యొక్క ఫోటోలను క్లిక్ మనిపిస్తుంది. దీనితో సూర్యునిపై కూడా మొదట ప్రయోగం చేసిన దేశంగా ఇండియా అవతరించనుంది.