ఇస్రో.. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్.. త్వరలోనే అంతరిక్షంలోని మనిషిని పంపే ప్రయత్నం చేస్తుంది. అందుకోసం అన్ని కార్యక్రమాలని మొదలెట్టింది. అంతరిక్షం ఎంత ఉందో ఎవరికీ తెలియదు. అంతులేని అంతరిక్షాన్ని పట్టుకునే ప్రయత్నం అని కాకపోయినా, అక్కడ ఉండే రహస్యాలని శోధించాలని మనిషి ఎప్పటి నుండో అనుకుంటున్నాడు. అందులో భాగంగానే ఎప్పటి నుండో అంతరిక్షంలోకి మనుషుల్ని పంపే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే సునీతా విలియమ్స్ మొదలగు వారు అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చారు.
తాజాగా ఈ ఏడాది అంతరిక్షంలోకి మనిషిని పంపే ప్రయత్నం చేస్తుంది. ఐతే అంతరిక్షంలోకి వెళ్ళీ వచ్చే వ్యోమనౌక ల్యాండింగ్ కోసం గుజరాత్ లోని వెరావల్ తీరాన్ని ఎంపిక చేసుకుంది. ఒకవేళ అక్కడ కుదరకపోతే బంగాళాఖాతంలో మరో తీరాన్ని ఎంపిక చేసుకుందట. రెండిట్లో ఏదో ఒక తీరాన్ని ఫైనల్ చేయనుంది. ఇప్పటికే ఎవరిని పంపాలనే విషయమై ఇస్రో ఒక నిర్ణయానికి వచ్చిందని సమాచారం.