సరిహద్దుల్లో భారత్ చైనా ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ ప్రాంతం లోకి చైనా ఆర్మీ ఒక్కసారిగా చొచ్చుకు వచ్చింది. 200 మంది చైనా సైనికులు భారత్ లోకి చొరబడాలని ప్రయత్నించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. భారత బంకర్లను ధ్వంసం చేసేందుకు చైనా ఆర్మీ ప్రయత్నించిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అయితే చైనా భారత్ బలగాలను దీటుగా తిప్పికొట్టిందని ఈ క్రమంలో రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తినట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ సమస్యపై చర్చిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా గతంలో కూడా చైనా భారత్ మధ్య ఈ ప్రాంతంలోనే ఘర్షణ వాతావరణం నెలకొంది. చైనా అక్రమంగా వంతెన నిర్మించడానికి ప్రయత్నించగా ఆ సమయంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. దాంతో అప్పటి నుండి డ్రాగన్ చర్యలపై భారత్ ఆర్మీ నిఘా పెంచింది. తాజాగా మరోసారి చైనా కవ్వింపు చర్యలకు పాలపడటం తో ఇండియన్ ఆర్మీ అప్రమత్తం అయ్యింది.