సోను సూద్ ఇంటి పై మరోసారి ఐటి దాడులు

ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనుసూద్ ఇంటిపై ఐటీ శాఖ అధికారులు మరోసారి దాడులు చేశారు. నిన్న ఆయన నివాసం మరియు కార్యాలయాల్లో ఐటీ దాడులు జరిగాయి. సుమారు 20 గంటలపాటు సోదాలు చేశారు ఐటి శాఖ అధికారులు. ఇక ఈ రోజు కూడా రియల్ హీరో సోనుసూద్.. ఇంట్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా లక్నోకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ తో చేసుకున్న ఒప్పందం పై హీరో సోనూసూద్ ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ ఐటీ దాడుల్లో ఇలాంటి ఆధారాలు… దొరకలేదని సమాచారం అందుతోంది.

sonu sood

కాగా ఢిల్లీ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పాఠశాల విద్యార్థుల మెంటాల్‌ షిప్‌ ప్రోగ్రాం కు ఇటీవల అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం.. సోనూసూద్‌ ను బ్రాండ్‌ అంబాసిడర్‌ గా నియామకం చేసింది. అంతకు ముందు పంజాబ్‌ ప్రభుత్వం లో కూడా కరోనా వైరస్‌ మీద అవగాహన కార్యక్రమం లో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ గా నియమితులయ్యారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా బీజేపీ పార్టీ కి వ్యతిరేకంగా ఉన్నవి కావడం గమనార్హం. ఇలాంటి నేపథ్యం లో సోనూసూద్‌ కు చెందిన టు వంటి.. ఆరు నివాసాల్లో ఐటీ శాఖ అధికారులు సర్వే చేశారనే సమాచారం.. దేశ వ్యాప్తం గా అలజడి రేపుతోంది.