ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కీల‌క బాధ‌త్య‌లు!

-

తెలంగాణ స‌ర్కార్ కు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కీల‌క బాధ‌త్య‌లు అప్ప‌గించింది.
తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నియమించబ‌డ్డారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. త‌న‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతో ఎమ్మెల్యే బాబిరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

mla bajireddy

నామినేటేడ్ పోస్టులను భర్తీ చేయాలని ఇటీవలే రాష్ట్ర స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యం మేర‌కు నామినేటేడ్ పోస్టులను భ‌ర్తీ చేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను ఆర్టీసీ ఎండీగా నియమిస్తున్నట్టు కీల‌క ఉత్త‌ర్వులు జ‌రిగింది తెలంగాణ సర్కార్…ఇప్పుడు ఛైర్మన్‌గా బాజిరెడ్డిని ఎంపిక చేసింది. ఇప్ప‌టికైనా .. టీఎస్ఆర్టీసీ ప్ర‌గ‌తి ప‌థంలో నడుస్తుందో వేచి చూడాలి.

గోవర్ధన్ రాజకీయ ప్రస్థానం చూస్తే..

సిరికొండ మండ‌లం రావుట్ల‌లో జ‌న్మించిన బాజిరెడ్డి గోవర్ధన్.. స‌ర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వ‌ర‌కు ఎదిగాడు.ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో కీల‌క నేత‌గా ఎదిగారు. 1973లో పోలీస్ పటేల్‌గా పనిచేసిన ఆయ‌న‌.. 1981లో చిమన్‌పల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆ తరువాత 1986లో సిరికొండ మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1986లో ఎపి స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్ అయ్యాడు. అనంత‌రం 1994లో ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటిచేసి ఓట‌మి పాల‌య్యాడు. ఆ త‌రువాత టీఆర్ఎస్ చేరి.. 2014, 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.2015-2018 వరకు, తెలంగాణ శాసనసభ వక్ఫ్ భూములపై ​​హౌస్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news